మణిపూర్ లో రాష్ట్రపతి పాలన పొడిగింపు
posted on Jul 25, 2025 10:19AM

కల్లోలంగా ఉన్న మణిపూర్ లో రాష్ట్రపతి పాలనను పొడగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. హింసాకాండ, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 3న మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి విదితమే. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమైన బీరేన్ సింగ్ ప్రభుత్వం వైదొలగడంతో ఆక్కడ రాష్ట్రపతి పాలన విధించారు.
తాజాగా అక్కడి పరిస్థితులు నెమ్మదినెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. పరిస్థితి పూర్తిగా అదుపులోనికి వచ్చే వరకూ రాష్ట్రపతి పాలన కొనసాగించాని కేంద్రం నిర్ణయించింది. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో మణిపూర్ లో రాష్ట్రపతి పాలన పొడగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ అందుకు ఆమోదం తెలిపింది. వెంటనే తీర్మానాన్ని రాష్ట్రపది ద్రౌపది ముర్ముకు పంపగా ఆమె ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తీ మణిపుర్ మరో ఆరు నెలల పాటు అంటే ఫిబ్రవరి 2026 వరకూ రాష్ట్రపతి పాలన కొనసాగనుంది.