ప్రత్యూష బెనర్జీ మాట్లాడిన చివరి మాటలు ఇవే..


బాలిక వధు సీరియల్ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకుని మరణించిన తరువాత రోజుకో కొత్త అంశం వెలుగు చూస్తూనే ఉంది. ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో ఎన్నో ట్విస్టులు బయటపడగా ఇప్పుడు తాజాగా మరో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. అదే ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యకు ముందు లాస్ట్ ఫోన్ కాల్.. దాదాపు 201 సెకన్ల నిడివితో ఉన్న ఈ టెలిఫోనిక్ సంభాషణలో పలు కీలక విషయాలు ఉన్నట్టు భావిస్తున్నారు. ప్రత్యూష తరపు లాయర్ కోర్టు తెలిపిన దాన్ని బట్టి.. "నువ్వు మోసగాడివి. నన్ను మోసం చేశావు. నా తల్లిదండ్రుల నుంచి నన్ను దూరం చేశావు. ఇప్పుడు చూడు నేనేం చేయబోతున్నానో.. చూడు అని ప్రత్యూష అనగా దానికి రాహుల్.. "ఏమైంది. నేను ఇంటికొచ్చాక నీతో మాట్లాడుతాను. నేను దారిలో ఉన్నాను. నేను ఇంటికొచ్చేవరకు ఏమీ చేయకు". అని అన్నాడు.

 

అంతేకాదు ఇంకా రాహుల్ తనకు 150 ఎకరాల భూమి ఉందని.. తన తల్లి ఒక ఎమ్మెల్యే అని అమ్మాయిలకి చెప్పి మోసం చేస్తుండేవాడని కోర్టుకు తెలిపారు. కానీ రాహుల్ లాయర్ మాత్రం చివరి ఫోన్ కాల్ ఆధారంగా జడ్జిమెంట్ ఇవ్వడం కుదరదు.. అసలు ఆత్మహత్యకు గల అసలు కారణాలేంటో దర్యాప్తు చేయాలని సూచించారు. మరి ఈ కేసులో ఇంకా ఎన్ని ట్విస్ట్ లు బయటపడతాయో లేదో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu