లోకేష్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. విషయమేంటంటే?
posted on Feb 5, 2025 5:10AM
.webp)
ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ తో జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. కేంద్ర ఐటీ శాఖ మంతరి అశ్విని వైష్ణవ్ ను కలిసేందుకు ఢిల్తీ వెల్లిన లోకేష్ తో భేటీ అయ్యేందుకు ప్రశాంత్ కిషోర్ వచ్చారు. ఎన్నికల వ్యూహకర్తగా మొదలకై సొంత పార్టీ పెట్టుకుని బీహార్ రాజకీయాలకే పరిమితమైన ప్రశాంత్ కిషోర్ లోకేష్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిరువురి మధ్యా ఏయే అంశాలపై చర్చ జరిగిందన్నది తెలియరాలేదు.
అయినా పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించడం మానేసి, ఐ ప్యాక్ నుంచి పూర్తిగా వైదొలగిన ప్రశాంత్ కిషోర్ పనిగట్టుకుని మరీ లోకేష్ తో భేటీ అవ్వడంపై పలు విధాలుగా చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన రాబిన్ శర్మ ప్రశాంత్ కిషోర్ శిష్యుడే. ఆయన ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో పార్టీ పటిష్టత కోసం రాబిన్ శర్మ పని చేస్తున్నారని అంటున్నారు. దానిపై క్లారిటీ లేదు. ఇప్పుడు లోకేష్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ అవ్వడం వెనుక కూడా తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకువెళ్లే వ్యూహాలపైనే చర్చ జరిగి ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు.
కాగా ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీహార్ లో తన పార్టీ జన జనసురాజ్ ను ఎన్నికలలో గెలిపించుకోవడంపైనే పూర్తిగా దృష్టి పెట్టారు. బీహార్ లో ఉద్యోగ నియామకాల విషయంలో జరిగిన అవకతవకలపై విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఇటీవల ఆమరణదీక్షచేసి ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయన బీహార్ లో గేమ్ చేంజర్ గా మారే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇక పోతే ప్రశాంత్ కిషోర్ లోకేష్ తో భేటీ, వారి మధ్య ఏయే అంశాలపై చర్చ జరిగిందన్న విషయంపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు.
అయితే రాజకీయ వ్యూహాల్లో నిష్ణాతుడిగాదేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ పనిగ్ట్టుకుని మరీ లోకేష్ తో భీటీ అవ్వడంపై మాత్రం రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఢిల్లీలోని ఏపీ సీఎం అధికారిక నివాసంలో బస చేసిన లోకేష్ ను కలిసేందుకే ప్రశాంత్ కిషోర్ అక్కడకు వచ్చారు. వీరిరువురి మధ్యా భేటీ ముందుగా నిర్ణయించిన మేరకే జరిగిందని అర్ధమౌతోంది.
గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఏపీలో తెలుగుదేశం కూటమి ఘన విజయం ఖాయమని బల్లగుద్ది మరీ చెప్పారు ప్రశాంత్ కిశోర్. అయన అంచనా వేసినట్లే ఆ ఎన్నికలలో తెలుగుదేశం కూటమి కనీవినీ ఎరుగని రీతిలో ఘన విజయం సాధించింది. వైసీపీ కనీపం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితమై ఘోరాతి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వాస్తవానికి అప్పుడు ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ నుంచి బయటకు వచ్చేశారు. ఆయన శిష్యుడు రాబిన్ శర్మ తెలుగుదేశం కోసం పని చేశారు. అయినా అప్పట్లో ప్రశాంత్ కిశోర్ తెలుగుదేశం కూటమి విజయం తథ్యమని చెప్పారు. అప్పటి నుంచీ ప్రశాంత్ కిశోర్ కు లోకేష్, చంద్రబాబుతో మంచి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. ఆ క్రమంలోనే లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉండగా ప్రశాంత్ కిశోర్ ఆయనతో భేటీ అయ్యారని చెబుతున్నారు.