బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ

 

మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇవాళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏడాది కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు బీజేపీతో తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నారు. ఏడాది క్రితం వైసీపీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సునీత ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

గతంలో పోతుల సునీత తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2017లో టీడీపీ తరఫున ఆమె తొలిసారిగా శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ టికెట్  ప్రయత్నించినా  దక్కలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో 2020 నవంబరులో ఆమె టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి అప్పటి అధికార పార్టీ అయిన వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికై సేవలందించారు.పోతుల సునీత రాజకీయ ప్రస్థానంలో ఇది మూడో మలుపు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu