యాంక‌ర్ స్వేచ్ఛ చ‌నిపోవ‌డానికి కార‌ణం అత‌డేనా?

 

పూర్ణ‌చంద్ర‌రావు అనే ఒక వ్య‌క్తితో యాంక‌ర్ స్వేచ్ఛ స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. గ‌తంలో కూడా ఆమె ఒక‌రితో వివాహం అయ్యి త‌ర్వాత విడిపోయారు. ఆమె టీవీనైన్ వంటి ప్ర‌ముఖ న్యూస్ ఛానెళ్ల‌లో ప‌ని చేశారు. చ‌నిపోయే నాటికి స్వేచ్ఛ టీ  న్యూస్ యాంక‌ర్ గా ఉన్నారు. అయితే ఆమెకు పూర్ణ‌చంద్ర‌రావు ఇక్క‌డే ప‌రిచ‌యం అయిన‌ట్టు తెలుస్తోంది. పూర్ణ టీ న్యూస్ ప్రోగ్రామింగ్ హెడ్ గా చేస్తున్నారు. స్వేచ్ఛ తండ్రి మాట‌ల‌ను బ‌ట్టీ చూస్తే పూర్ణ‌చంద్ర‌రావు త‌న కూతురి వెంట మూడేళ్లు ప‌డ్డాడ‌నీ.. త‌న భార్య‌ను వ‌దిలి నిన్నే పెళ్లాడుతానంటూ అత‌డు ఆమెను న‌యానా భ‌యానా ఒప్పించాడ‌నీ.. ఇందువ‌ల్లే ఆమె ఇత‌డితో స‌హ‌జీవ‌నం చేస్తూ వ‌చ్చింద‌ని అంటున్నారాయ‌న‌.

అయితే గ‌త కొంత కాలంగా స్వేచ్ఛ పూర్ణ మ‌ధ్య వివాదం న‌డుస్తోంద‌ని.. అత‌డ్ని పెళ్లి చేసుకోమ‌ని ఈమె ఎంత అడుగుతున్నా.. ఇంట్లో క‌న్విన్స్ చేయాల్సి ఉంద‌ని అత‌డు త‌ప్పించుకుని వ‌స్తున్నాడ‌ని అన్నారు స్వేచ్ఛ తండ్రి. ఫైన‌ల్ గా తామిద్ద‌రం విడిపోద‌లుచుకున్నామ‌ని త‌న‌తో త‌న కూతురు చెప్పింద‌ని అంటున్నారు స్వేచ్ఛ తండ్రి. ఏది ఏమైనా త‌న బిడ్డ చావుకు కార‌ణం ఈ పూర్ణ చంద్ర రావే కాబ‌ట్టి అత‌డిపై తాను కేసు పెట్టానని చెబుతున్నారు స్వేచ్ఛ తండ్రి. అత‌డ్ని తాను చూడ్డం కూడా ఇదేన‌ని.. ఇంత వ‌ర‌కూ తాను చూడ‌లేదని.. అన్యాయంగా త‌న కూతురికి మాయ మాట‌లు చెప్పి.. మోసం చేసి, చివ‌రికి ఆమె ప్రాణాలు పోవ‌డానికి గ‌ల కార‌ణ‌మైన  ఇత‌గాడికి త‌గిన శిక్ష ప‌డాల‌ని డిమాండ్ చేస్తున్నారు యాంక‌ర్ స్వేచ్ఛ తండ్రి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu