గాంధీని నేనే చంపేదాన్ని.!!
posted on Aug 24, 2018 10:46AM

మహాత్మా గాంధీ స్వాతంత్య్రం కోసం అహింసా మార్గంలో పోరాడిన వ్యక్తి.. ఆయన్ని భారత జాతి జాతిపిత అని పిలుస్తుంది.. గాంధీని గాడ్సే చంపాడన్న విషయం తెలిసిందే.. అయితే గాంధీని గాడ్సే చంపకపోయి ఉంటే నేను చంపేదాన్ని అని హిందూ కోర్టు జడ్జి, సామాజిక కార్యకర్త పూజ శకున్ పాండే సంచలన వ్యాఖ్యలు చేసారు.. ఒక న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘నేటికైనా సరే.. దేశాన్ని విభజించాలని భావించే గాంధీ ఒకరుంటే, అడ్డుకునే గాడ్సే ఒకరుంటారు.. నాథూరామ్ గాడ్సేను నేను ఆరాధిస్తానని చెప్పడానికి గర్విస్తున్నాను.. గాంధీని గాడ్సే చంపలేదు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చేలోపే అతడిని శిక్షించారు.. అందరూ అసలు చరిత్ర చదవాలి’’ అని అన్నారు.. ఆమె వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.