యనమల 'రూట్ కెనాల్ ట్రీట్మెంట్' కి అంత ఖర్చా..!!
posted on Aug 23, 2018 5:52PM
.jpg)
రూట్ కెనాల్ ట్రీట్మెంట్ వినే ఉంటారు.. దంతాలకు సంబంధించిన ట్రీట్మెంట్.. మరీ పెద్ద ఖర్చేమీ కాదు.. హైదరాబాదు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలలో అత్యంత అధునాతన దంత వైద్య ఆసుపత్రులలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కు మహా అయితే వేలల్లో తీసుకుంటారు.. కానీ ఏపీ ఆర్ధికమంత్రి శ్రీ యనమల రామకృష్ణుడుకి మాత్రం ఏకంగా లక్షల్లో ఖర్చయింది.. మరి ఆయన అక్కడ ఇక్కడ కాదు ఏకంగా సింగపూర్ లో ట్రీట్మెంట్ చేయించుకున్నారు.. దానికైన ఖర్చు ఎంతో తెలుసా?.. 2,88,823 రూపాయిలు.. అక్షరాలా రెండు లక్షల ఎనభైఎనిమిది వేల ఎనిమిదివందల ఇరవైమూడు రూపాయిలు.. ఇదంతా ప్రభుత్వ సొమ్ము.. ట్రీట్మెంట్ కి అయిన మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసింది కూడా.. ఇంతవరకు బాగానే ఉంది కానీ, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కు ఇంత ఖర్చు ఏంటని కొందరు అనుమానం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు ప్రభుత్వ సొమ్మును వృధా చేస్తున్నారంటూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
.jpg)