పూజా ఖేడ్కర్‌‌కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

 

మాజీ ప్రొబెషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్‌  మే 2వ తేదీన ఢిల్లీ పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.  జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్‌ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను మే 21వ తేదీకి వాయిదా వేసింది. అప్పటివరకు ఖేద్కర్‌పై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. అంతకు ముందు అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో నిజమైన ఎంక్వైరీ జరగలేదని  త్వరగా ఈ కేసు విచారణ ముగించాలని పోలీసులను ఆదేశించింది. 

పోలీసుల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఖేద్కర్‌ను కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని .. అయితే కోర్టు ఆమెకు మధ్యంతర రక్షణ కల్పించిందని అన్నారు. కోర్టు దాన్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో యూపీఎస్సీ నమోదు చేసిన క్రిమినల్ కేసుపై తాజాగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అధికార దుర్వినియోగం,తప్పుడు ధ్రువపత్రాల సమర్పణ వ్యవహారంలో పూజా ఖేద్కర్‌ ,యూపీఎస్సీ మాజీ ప్రొబేషనరీ అధికారిణి పేరు ఇటీవలా మీడియాలో వినిపించింది. ఆమెపై క్రిమినల్‌ కేసు నమోదైందైన సంగతి తెలిసిందే.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu