బాలయ్య కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు.. ఎక్కడంటే?

తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన సొంత నియోజకవర్గం హిందూపురంలోనే పోలీసులు ఆయన కాన్వాయ్ ను అడ్డుకున్నారు. చితమత్తూరు మండలంలోని కొడికొండ గ్రామం వద్ద ఈ సంఘటన శుక్రవారం జరిగింది.

నేపథ్యమేమిటంటే  కొడికొండలో ఇటీవల జరిగిన జాతరలో తెలుగుదేశం, వైసీపీ ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో గాయపడిన తెలుగుదేశం కార్యకర్తలను పరామర్శించేందుకు బాలకృష్ణ వచ్చారు. అయితే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఉద్రిక్తంగా ఉందంటూ బాలకృష్ణ వాహన శ్రేణిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బాలకృష్ణ, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. తెలుగుదేశం శ్రేణులు భారీగా మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

దీంతో వెనక్కు తగ్గిన పోలీసులు బాలకృష్ణకు గ్రామంలనికి అనుమతించారు. అయితే కాన్వాయ్ ను మాత్రం అనుమతించలేదు. బాలకృష్ణ వాహనాన్ని మాత్రమే పోలీసులు అనుమతించారు. గ్రామాల్లో కక్షలు పెచ్చరిల్లేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారంటూ బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం కార్యకర్తల జోలికి వస్తే కబడ్దార్ అంటూ హెచ్చరించారు. మూడేళ్లలో బాదుడే బాదుడు తప్ప తెలుగుదేశం చేసిందేమీ లేదని విమర్శించారు.