చాతకాని దద్దమ్మ జగన్.. రాష్ట్రం పరువు తీస్తున్నాడు.. మహానాడు వేదికపై చంద్రబాబు ఫైర్

తెలుుదేశం అంటే చైతన్యం. తెలుగుదేశం అంటే అభివృద్ధి, తెలుగుదేశం అంటే సంక్షేమం. అలాంటి తెలుగుదేశం పార్టీని అంతమొందించడం ఎవరి తరం కాదు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలను ఎంతగా ఇబ్బందులకు గురి చేస్తే అంతకు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఒంగోలులో రెండు రోజుల పాటు జరిగే మహానాడు కార్యక్రమంలో తొలి రోజు శుక్రవారం చంద్రబాబు ప్రారంభోత్సవంలో చంద్రబాబు తొలి పలుకులివి.

మహానాడును తెలుగు జాతి పండుగగా అభివర్ణించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు, సీఎం జగన్ చాతకాని దద్దమ్మ అని ఘాటుగా విమర్శించారు. జగన్ రాష్ట్రం పరువు తీస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్మాది పాలనను అంతమొందించాలని పిలుపు నిచ్చారు. ఒంగోలు వేదికగా జరుగుతున్న మహానాడులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. చాతకాని దద్దమ్మ పాలనలో రాష్ట్రం పరువు గంగలో కలుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా జగన్ సర్కార్ తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేయడం, దాడులు చేయడం, కేసులు పెట్టడంపైనే దృష్టి పెట్టిందని చంద్రబాబు విమర్శించారు. 
 రాష్ట్రంలో ఎక్కడ చూసినా బాదుడే బాదుడు. ఇంటిపన్ను, చెత్తపన్ను, డ్రైనేజీ ట్యాక్స్‌ ఇలా అన్నీ పంచేశారు. కేంద్రం తగ్గించినా జగన్ పెట్రో ధరలు తగ్గించడం లేదు.   రాష్ట్రంలో రైతులు ఆనందంగా లేరు. మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరేసే పరిస్థితి తీసుకోస్తారా?  మహిళలకు భద్రత లేదు. అమ్మ ఒడి అన్నారు.. నాన్న బుడ్డీ పెట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, పేరలకు తక్కువ ధరకూ కడుపు నిండా అన్నం పెడుతున్న అన్న క్యాంటీన్లను తీసేశారు.

విదేశీ విద్య, పెళ్లి కానుక పథకాలన్నీ రద్దు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు. ఈ ఉన్మాది పాలనను అంతమొందించడమే లక్ష్యంగా పని చేయాలి అంటూ చంద్రబాబు మహానాడు వేదికగా పిలుపు నిచ్చారు.  నిలదీస్తే, విమర్శిస్తే, ప్రశ్నిస్తే దాడులు చేస్తున్న జగన్ సర్కార్ కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. వైసీపీ తాటాకు చప్పుళ్లకు తెలుగుదేశం బెదరిపోదన్నారు. ఎవరు తప్పు చేసినా ఉపేక్షించమని స్పష్టం చేశారు. మహానాడుకు భారీగా హాజరైన తెలుగు తమ్ముళ్లను ఆయ అభినందించారు.