రాజ్ పాకాల ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు
posted on Oct 28, 2024 4:34PM

జన్వాడలోని ఫామ్ హౌస్ లో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల పార్టీ వ్యవహారం ముదిరి పాకాన పడింది. తాము ఇచ్చిన నోటీసులకు రాజ్ పాకాల స్పందించకపోవడం, అందుబాటులోకి రాకపోవడంతో ఆయన పరారీలో ఉన్నట్లుగా పరిగణించిన పోలీసులు ఆయన ఇంటికి నోటీసులుఅంటిం చారు.విచారణకు హాజరు కావాలనీ లేదంటే అరెస్టు చేస్తామని ఆ నోటీసులో పేర్కొన్నారు. రాజ్ పాకాల పరారీలో ఉండటంతో పోలీసులు అతని ఇంటికి నోటీసులు అంటించారు.
ఇలా ఉండగా నిన్నటి నుంచి ఆచూకీ చిక్కకుండా పరారీలో ఉన్న రాజ్ పాకాల తనను కుట్రపూరితంగా అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించారు. తనను పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ ఎప్పుడు విచారణకు వస్తుందన్నది వెంటనే తెలియరాలేదు. దీంతో కోర్టులో ఈ పిటిషన్ విచారణకు వచ్చే లోగా పోలీసులు రాజ్ పాకాలను అరెస్టు చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.