యాక్సిడెంట్.. హాలీవుడ్ నటుడి మృతి

 

ప్రముఖ హాలీవుడ్, టీవీ నటుడు, బాడీ బిల్డర్, మోడల్, హాలీవుడ్ స్టార్స్‌కి పర్సనల్ ట్రైనర్ అయిన గ్రెగ్ ప్లిట్ (37) ఒక ప్రమాదంలో మరణించాడు. ‘ఫ్రెండ్స్ టు లవర్స్’ అనే టీవీ రియాల్టీ షోకి ప్లిట్ ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ కాలిఫోర్నియాలోని బర్బాంక్ రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు పట్టాల మీద జరుగుతూ వుండగా రైలు ఢీకొని ప్లిట్ మరణించాడు. దూరంగా వస్తున్న రైలును ప్లిట్ గమనించినప్పటికీ అది మరో ట్రాక్ మీద వస్తోందని అనుకున్న ఆయన కదల కుండా అక్కడే నిల్చున్నాడు. అయితే ఆ రైలు ప్లిట్ వున్న ట్రాక్ మీదకు రావడంతో ఆయన దుర్మరణం పాలయ్యాడు. ప్లిట్‌కి రైల్వే ట్రాక్ అంటే చాలా ఇష్టం. గతంలో తనకు సంబంధించిన అనేక టీవీ ఎపిసోడ్స్, తాను వర్కవుట్ చేసే వీడియోలు చాలా రైల్వే ట్రాక్ మీదే షూట్ చేశాడు. చివరికి ఆయన రైలు ఢీకొని రైలు పట్టాల మీదే మరణించాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu