పోలవరం ప్రాజెక్టుకు 250 కోట్లు

 

పదహారు వేల కోట్ల రూపాయల వ్యయం అయ్యే ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు కోసం ఈమధ్య కేవలం వంద కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. అంత భారీ వ్యయమయ్యే ప్రాజెక్టుకు తొలి విడతగా మోడీ సర్కారు వంద కోట్లు కేటాయించడం మీద భారీ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. మోడీ ముష్టి వేశాడన్న విమర్శలు కూడా వినిపించాయి. అయితే మోడీ ప్రభుత్వం తాను చేసిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరానికి పోలవరం ప్రాజెక్టు కోసం మరో 250 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్టు కేంద్ర ప్రకటించింది. ఈ మేరకు గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu