ఒత్తిడి వల్లే ఓడిపోయాం...
posted on Mar 26, 2015 6:00PM

ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో 329 పరుగుల లక్ష్యంతో దిగిన భారత్ ఆస్ట్రేలియా మీద ఓడిపోయింది. పేలవమైన ఆట తీరు ప్రదర్శించి ఇంకా ఓవర్లు మిగిలుండగానే ఆల్ ఔట్ అయ్యారు. ఆస్ట్రేలియాతో ఓటమి అనంతరం కెప్టెన్ ధోని మాట్లాడుతూ ఒత్తిడిని అధిగమించలేకపోయామని, ఈ మ్యాచ్ లో స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయామని చెప్పాడు. భారత్ ఓపెనర్లు శుభారంభం అందించినా వెంటవెంటనే కీలక వికెట్లు కోల్పోవడం వల్ల ఓడిపోయామని అన్నాడు. తాను కూడా పూర్తిస్థాయిలో రాణించలేకపోయానని అంగీకరించాడు. నీకిదే ఆఖరి ప్రపంచ కప్పా అన్న ప్రశ్నకు తన వయసు 33 ఏళ్లని, వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచ కప్లో ఆడుతానని, ఆ తర్వాత ఫిట్నెస్ను బట్టి 2019 ప్రపంచ కప్లో ఆడాలా వద్దా అన్న విషయంపై నిర్ణయం తీసుకుంటానని ధోనీ అన్నాడు.