నాలుగేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం..
posted on Apr 11, 2015 5:56PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా బాలసముద్రం వద్ద నేషనల్ సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అకాడమీని ప్రారంభించారు. కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ బెంగుళూరుకు దగ్గరలోనే నేషనల్ అకాడమీ ఏర్పాటు కావడం సంతోషకరమన్నారు. దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదవుతున్న ప్రాంతాల్లో అనంతపురం రెండో స్థానంలో ఉందని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు భూసేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేవని, నాలుగేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. బెంగుళూరు-హైదరాబాద్ మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుచేయాలని చంద్రబాబు అరుణ్ జైట్లీని కోరారు.