డియర్ ఇమ్రాన్.. ఇట్లు మీ మోదీ..

భారత ప్రధాని మోదీ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు లేఖ రాశారు. పొరుగునే ఉన్న పాక్‌తో సత్సంబంధాలనే కోరుకుంటున్నామని చెప్పారు. అయితే, నమ్మకమైన వాతావరణాన్ని మాత్రం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదానికి తావులేని వాతావరణాన్ని కూడా కల్పించాల్సిన బాధ్యత పాకిస్తాన్‌పైనే ఉందని మోదీ లేఖలో తెలిపారు. 

పాకిస్తాన్ నేషనల్‌డే సందర్భంగా ప్రధాని మోదీ పాక్ ప్రధానికి లేఖ రాశారు. ‘‘ఓ పొరుగు దేశంగా మీతో సత్సంబంధాలనే కోరుకుంటున్నాం. దీనికోసం విశ్వసనీయ వాతావరణాన్ని కల్పించాల్సి ఉంది. అంతేకాకుండా ఉగ్రవాదానికి తావులేని వాతావరణం కూడా కల్పించాలి.’’ అని మోదీ ఆ లేఖలో రాశారు. ఒకవైపు పాక్‌కు చురకలు పెడుతూనే మరోవైపు కొవిడ్ కట్టడి విషయంలో ఇమ్రాన్ చేస్తున్న ప్రయత్నాలను పొగిడారు. కొవిడ్‌కు ముకుతాడు వేసే క్రమంలో ఇమ్రాన్ ప్రభుత్వం చేసిన పోరాటాన్ని మోదీ అభినందించారు. కరోనాను సమర్థంగా ఎదుర్కొన్న పాక్ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు చెప్పారు. 

సడెన్‌గా ప్రధాని మోదీ.. పాక్ ప్రధానికి లేఖ రాయడంపై చర్చనీయాంశమైంది. అయితే, ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని.. ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా లేఖ రాశారని పీఎంవో వర్గాలు స్పష్టం చేశాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu