తెలుగు రాష్ట్రాల సీఎంలతో పీఎం వీడియో కాన్ఫరెన్స్

ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్రమోడీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానున్నారు. బుధవారం (జూన్ 25) జరిగే ఈ సమావేశంలో ఈ ఇద్దరు సీఎంలతో పాటు ఒడిశా, ఛత్తీస్ గఢ్ సీఎంలు కూడా పాల్గొంటారు. ఈ సమావేశంలో ప్రగతి అజెండాపై చర్చిస్తారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో అభివృద్ధి ప్రాజెక్టులు సహా పలు కీలక అంశాలపై మోడీ చర్చిస్తారని అంటున్నారు. అలాగే  రాష్ట్రాల మధ్య సహకారం పెంచి, కేంద్ర-రాష్ట్ర సమన్వయంతో ప్రాజెక్టులను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. వివాదాస్పద అంశాలైన పోలవరం ప్రాజెక్ట్, రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు, రైల్వే, రోడ్డు, విద్యుత్, గనులు, గిరిజన సంక్షేమం వంటి అంశాలపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశాలు ఉన్నాయి.

పోలవరం ప్రాజెక్ట్‌పై గతంలో మే 28న జరిగిన సమావేశంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలు వరదలు, గిరిజన భూముల సమస్యలపై ఆందోళనలు వ్యక్తం చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే పోలవరం అంశం కూడా మరోమారు చర్చకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం పురోగతి, ఒడిశాలో రూ.18,600 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు, తెలంగాణలో రూ.56,000 కోట్ల ప్రాజెక్టులు, ఛత్తీస్‌గఢ్‌లో గనుల సంబంధిత సమస్యలపై చర్చలు జరగనున్నాయని సమాచారం.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu