మహాబలిపురం లో ఇరు దేశాల బంధం బలపడబోతోందా?
posted on Oct 11, 2019 12:16PM

మోదీ ఏ పని చేసినా ఏదో ఒక అర్ధం ఉంటుంది అని అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు మోదీ డ్రాగన్ దేశంతో భేటీలో ఏదైనా వ్యూహం దాగుందా అనే అంశం అందరిని ఆలోచనలో పడేసింది. కశ్మీర్ విషయంలో అనవసరమైన జోక్యం ఓ వైపు, సరిహద్దుల్లో కవ్వింపులు మరో వైపు అన్నట్లుగా భారత్ కు వ్యతిరేకంగా ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటున్న చైనా వైఖరిలో మార్పు సాధ్యమవుతుందా అని అందరిలో వెల్లువడే పశ్న. మహాబలిపురం వేదికగా ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ల సమావేశం కొత్త చరిత్రకు నాంది పలుకబోతున్నారా అని వేచి చూస్తున్నారు. పాకిస్థాన్ ను ఒంటరి చేసే వ్యూహానికి అంతా సిద్దం చేస్తున్నారా ఇలాంటి సందర్బాలలో అంతర్జాతీయంగా మారిన పరిణామాలతో చైనా వైఖరి ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా అవకాశం వచ్చిన సమయంలో భారత్ కు వ్యతిరేకంగా పావులు కదిపే డ్రాగన్ దేశం ద్వైపాక్షిక సంబంధాల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది. ముఖ్యంగా పాకిస్థాన్ కు అన్ని విధాలుగా మద్దతిస్తున్న చైనా ఇప్పుడు భారత్ పై తన వైఖరిని మార్చుకుందా సరిహద్దు కయ్యాలకు చెక్ పడబోతుందా అనే చర్చ జరుగుతోంది. దీనికి కారణం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రెండు రోజుల భారత పర్యటన చెన్నై సమీపం లోని మహాబలిపురంలో ఇరు దేశాధినేతలు కలుసుకోబోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ జిన్ పింగ్ భేటీ ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే కశ్మీర్ పై చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయి. ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తరువాత చైనా సహకారం తోనే పాకిస్థాన్ ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి తీసుకెళ్లింది. అక్కడి కూడా పాకిస్థాన్ కు వంత పాడింది. అదే కశ్మీర్ విషయం లో ఏం జరుగుతుందో పరిశీలిస్తున్నామంటూ జిన్ పింగ్ చెబుతున్నారు అయితే చైనా చర్యలకు భారత్ దీటుగా సమాధానమిచ్చారు. ఇప్పుడు ఇద్దరు నేతలు సమావేశం అవుతుండడంతో ఈ అంశం చర్చకు రాబోతుందని చెబుతున్నారు. అయితే ఇద్దరి భేటీకి చెన్నైలోని మహాబలిపురం వేదికగా మారింది. వేదిక కూడా రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి భారతగా మారుతుంద ని చెబుతున్నారు. రెండ్రోజుల పాటు జరిగే సమావేశాల్లో మోదీ జిన్ పింగ్ మధ్య కీలక చర్చలు సాగుతాయని చెబుతున్నారు.
గతంలో జింపింగ్ వచ్చినప్పుడు మోదీ గాంధీ అశ్రమానికి తీసుకెళ్లారు. శాంతి అహింస సత్యం లాంటి ధర్మాల గురించి వివరించారు అయితే ఇప్పుడు పల్లవుల కాలం నాటి నగరం మహాబలిపురం వేదికగా మార్చుకోవటం ఆసక్తిరేపుతోంది. అటు రెండు దేశాల దౌత్యాధికారుల సైతం ఇది భారత్ చైనాల మధ్య బంధం మరింత బలోపేతం చేసే దిశగా తీసుకెళ్లడంపై దృష్టి సారిస్తారని అంటున్నారు. చారిత్రకంగా ప్రాధాన్యమున్న మహాబలిపురానికి చైనా తో సన్నిహిత సంబంధాలున్నాయి.ముఖ్యంగా పదమూడు వందల ఏళ్ల క్రితం ఇక్కడి నుంచి చైనాకు రాకపోకలు సాగేలా చెబుతారు జిన్ పింగ్ తో భేటీకి ప్రధా ని మోదీ మహాబలిపురం ఎంచుకోవటానికి రెండు కారణాలు ఉ న్నాయి. ఒకటి చైనా తో ఉన్న బంధం రెండు ప్రపంచాని కి దేశం లో మరిన్ని ప్రాంతాల్ని పరిచయం చేయాలనే ఉద్దేశం అయితే పదమూడు వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని పల్లవులు పాలించిన సమయంలో చైనా బౌద్ధమత గురువు కాంచీపురాని సందర్శించినట్లు చెబుతారు. అంతేకాదు చైనాలో జేయిన్ బౌద్ధాన్ని విస్తరించిన బోధిధర్మ కూడా మహాబలిపురం నుంచి చైనాకు వెళ్లినట్టు చెబుతున్నారు. అప్పట్లో పల్లవులు మహాబలిపురాన్ని వాణిజ్య తీర ప్రాంతగా మార్చుకున్నారు. పల్లవులు చోళుల సమయంలో ఇక్కడి నుంచి చైనాలోని సౌతీస్ట్ ప్రాంతాలకు వాణిజ్యం కూడా నడిచిందని చెబుతున్నారు. దౌత్యపరంగా, వాణిజ్య పరంగా చైనాతో మహాబలిపురానికి మంచి సంబంధాలున్నాయి, అయితే పదమూడు వందల ఏళ్ల క్రితం నాటి బంధాన్ని మళ్లీ కొనసాగించాలన్నది ప్రధాని మోదీ ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే దాయాది పాక్ సహకారం అందించకుండా చైనాను కట్టడి చేయడం తో పాటు సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడం ఈ సమావేశం కారణంగా కనిపిస్తోంది అందుకే మోదీ జిన్ పింగ్ భేటీ పై ఆసక్తికర చర్చ సాగుతోంది .ఈ భేటీ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య ఎలాంటి ఒప్పందాలు ఎంవోయూలు లేవంటోంది విదేశీ మంత్రిత్వ శాఖ.ఇక ఈ భేటీతో ఇరు దేశాల మధ్య బలోపేతం ఎర్పడబోతోందా లేదా చూడాలి.