మోడీతో ముగిసిన జగన్ భేటీ...బీజేపీకే మద్దతు..
posted on May 10, 2017 2:49PM
.jpg)
ప్రధాని మోడీతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ మాట ఇచ్చిన ప్రకారం.. తిరుపతిలో మీరు మాట ఇచ్చిన ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానిని కోరామని.. ఇతర రాష్ట్రాలతో ఏపీ పోటీపడాలంటే ప్రత్యేక హోదా అవసరమని చెప్పామని అన్నారు. ఇంకా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని.. అగ్రిగోల్డ్ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరామని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల గురించి మాట్లాడుతూ..రాష్ట్రపతి ఎన్నికకు ఎవరైనా పోటీ పెట్టాలంటే అది తప్పు, ఎన్డీఏ వద్ద తగినంత సంఖ్యాబలం ఉందని, వాళ్లే గెలుస్తారని, ఎలాగు ఓడిపోతామన్నప్పుడు పోటీ పెట్టడం మంచిది కాదన్నారు. రాష్ట్రపతిలాంటి పెద్ద పదవికి పోటీ లేకుండానే ఎంపిక జరగాలి.. ఒక్క ప్రత్యేక హోదా అంశంతో తప్ప బీజేపీతో మాకు ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు..బీజేపీ అభ్యర్ధికే మా మద్దతు ఉంటుందని తెలిపారు.