మోడీ డిగ్రీ పట్టాను వెబ్‌సైట్‌లో పెట్టండి.. కేజ్రీవాల్
posted on May 5, 2016 3:28PM

ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలు చెప్పాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సమాచార హక్కు చట్టం కమిషనర్ కు లేక రాసిన సంగతి తెలసిందే. అయితే దీనిపై కమిషనర్ స్పందించి మోడీ విద్యార్హతల గురించి వివరణ ఇచ్చారు. మోడీ గుజరాత్ యూనివర్శిటీ నుండి ఎం.ఎ పొలిటికల్ సైన్స్ లో ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఎం.ఏ. రాజనీతి శాస్త్రంలో 62.3 శాతం మార్కులతో పాస్ అయ్యారని.. ఎం.ఏ. సెకండ్ ఇయర్ లో రాజనీతిశాస్త్రంలో 64 మార్కులు, ఐరోపా-సామాజిక రాజనీతిజ్ఞతలో 62 మార్కులు, ఆధునిక భారతదేశం-రాజకీయ విశ్లేషణలో 69 మార్కులు, రాజనీతి మనోవైజ్ఞానిక శాస్త్రంలో 67 మార్కులు మోదీ సంపాదించారుని తెలిపారు.
అయితే ఇప్పుడు దీనిపై కేజ్రీవాల్ ఢిల్లీ యూనివర్సిటీ వీసీకి కేజ్రీవాల్ మరోసారి లేఖ రాశారు. మోడీ డిగ్రీ పట్టాను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని విజ్ఞప్తి చేశారు.