పీఎం ఏసీ యోజన.. నిజంగా ఇది చల్లటి కబురే!
posted on Apr 18, 2025 4:14PM

వేసవి ఉక్కపోతకు సామాన్యులు అల్లాడిపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త పథకంతో ముందుకు రాబోతున్నది. అదే పీఎం ఏసీ యోజన. ఈ పథకం ద్వారా పేదలకు సబ్సిడీ ధరలకే ఏసీలు అందజేస్తారు. ఈ పథకం ఎప్పటి నంచి ప్రారంభం అవుతుందన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసిందని చెబుతున్నారు. అన్ని వర్గాలూ ఎండా కాలంలో ఉక్కపోతనుంచి రక్షణ పొందాలన్న ఉద్దేశంతోనే పీఎం ఏసీ యోజన పథకాన్ని తీసుకువస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ వేసవి నుంచి కాకపోయినా వచ్చే వేసవి నాటికైనా ఈ పథకాన్ని అమలులోకి తీసుకురావాలని కేంద్రం కృత నిశ్చయంతో ఉందని చెబుతున్నారు.
అలాగని ఇదేమీ గతంలో ఎన్నడూ లేని సరికొత్త పథకం కాదు. కొంచం అటూ ఇటూలో సబ్సీడీపై ఏపీలు అందజేసే పథకం ఇప్పటికే ఢిల్లీలో అమలులో ఉంది. ఢిల్లీలో 3 స్టార్ అంతకంటే తక్కువ సామర్థ్యం ఉన్న ఏపీలను ఇచ్చి 60శాతం డిస్కౌంట్ లో 5స్టార్ ఏసీలను ఇచ్చే పథకం ఒకటి ఢిల్లీలో బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు కేంద్రం భారీ సబ్సిడీలో పేదలకు ఏపీలను అందించే పథకానికి రూపకల్పన చేయనుంది. వేసవి తీవ్రత ఏటికేడు పెరిగిపోతుండటంతో వారికి ఒకింత చల్లటి కబురు చెప్పాలని కేంద్రం భావిస్తోంది. అలాగే పేదలపై విద్యుత్ భారం పడకుండా ఉండేలా ఈ పథకాన్ని రూపకల్పన చేసి అమలు చేయాలని భావిస్తోంది.