కూల్ డ్రింక్‌లో బల్లి..అస్వస్థతకు గురైన యువకుడు
posted on Apr 18, 2025 3:57PM

సమ్మర్ వచ్చిందంటే ఎండతాపం నుంచి ఉపసమనం పొందేందుకు కూల్ డ్రింక్స్, ప్రూట్ జ్యూస్ వంటికి తాగుతుంటారు. ఇలానే కూల్‌డ్రింక్ తాగేందుకు వెళ్లిన ఇద్దరి యువకులకు భారీ షాక్ తగిలింది. వాళ్లలొ ఒకరు తాగిన కూల్‌డ్రింక్‌లో బల్లి అవశేషాలు ప్రత్యక్షమైంది. అది చూసిన యువకుడు కంగుతిన్నాడు.ఈ విషయాన్ని హోటల్ నిర్వాహకుడి దృష్టికి తీసుకెళ్లినా.. వారు పెద్దగా స్పందించలేదు. ఆ యువకులకు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. వారి తీరుపై ఆ యువకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సదాశివపేట పరిధిలోని పెద్దపూర్ వద్ద ఎన్‌హెచ్ 65 పక్కన ఉన్న హోటల్‌లో ఇద్దరు యువకులు తాగిన కూల్ డ్రింక్‌లో చనిపోయిన బల్లి కనిపించాయి. అనంతరం సగం కూల్ డ్రింక్ తాగడంతో యువకుడు స్వల్ప అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. ఈ క్రమంలోనే యువకుడిని ఆసుపత్రికి స్నేహితులు తరలించారు.
ఈ ఘటన నేపథ్యంలో ఆహార భద్రత అధికారులు చర్యలు తీసుకోవాలని కస్టమర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ హైదరబాద్ నగరంలో నిత్యం పలు రెస్టారెంట్‌లలో ఇలాంటి నిర్లక్ష్యం కనుబడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటి ఫుడ్ తినాలంటే ప్రజలు భయపడుతున్నారు కనీస శుభ్రత పాటించని హోటళ్లు కొన్నయితే పాడైన ఆహార పదార్థాలు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్లు మరికొన్ని. ఇవన్నీ చూసి ప్రజలు బయటి ఆహారం తినాలంటే భయపడుతున్నారు. ఇంటి ఫుడ్‌నే సో బేటర్ అంటున్నారు.