పిల్ల సజ్జల పరార్?.. సజ్జల ఫోనూ స్విచ్ఛాఫ్!?

పెరుగుట విరుగుట కొరకే ... ఇదొక సామెత ఇప్పుడు సజ్జలకు అతికినట్లు సరిపోతుంది.  నడిమంత్రపు సిరి నరం మీద పుండులానే సలుపుతుంది. సరిగ్గా సజ్జల కూడా ఆయన జర్నలిజం బ్యాక్ గ్రౌండో, సామాజిక సమీకరణమో ఏదో కలిసి వచ్చి జగన్ కు కుడి, ఎడమ భుజంగా మారిపోయారు. జగన్ అధికారంలో ఉన్నంత కాలం ఆయన ముఖంలా, గొంతులా వ్యవహరించారు. అయితే ఈ క్రమంలో పార్టీలో ప్రభుత్వంలో ఆయన ఎదుగుదల ఎంత వేగంగా సాగిందో.. అంత కంటే వేగంగా పార్టీ ఓటమి పాలైన రోజుల్లోనే పతనం పరాకాష్టకు చేరింది.  

నిజానికి ఒక జర్నలిస్ట్గా వ్యాపారవేత్తగా ఎదిగొచ్చిన సజ్జల రామకృష్ణా రెడ్డి గతం గురించి తెలిసిన ఎవరైనా, ఆయనొక జెండిల్మాన్, మంచి మనిషి అనే అంటారు. అయితే, రాజకీయ అరంగేట్రం తర్వాత ఆయనలో మార్పు.. మార్పు అనాలా, ఆయన సహజ గుణం అనాలా అన్నది ఎవరికి వారే తేల్చుకోవాలి. సరే అది పక్కన పెట్టి విషయంలోకి వస్తే.. జగన్ రెడ్డి కళ్ళు, చెవులు అన్నీ తానే అన్నట్లు వ్యవహరిస్తూ వచ్చిన సజ్జల ఇష్టారీతిగా వ్యవహరించారు. వైసీపీ సోషల్ మీడియా వింగ్ ను తన పుత్రరత్నం, పిల్ల సజ్జల అదే సజ్జల భార్గవరెడ్డికి అప్పగించారు. సోషల్ మీడియా చేతిలో పెట్టుకుని ఇష్టారీతిగా చెలరేగిన భార్గవ్ పార్టీ పరాజయం పాలైన తొలి రోజే అంటే ఫలితాలు వెలువడుతుండగానే అజ్ణాతంలోకి వెళ్లిపోయారు.

ఆ తరువాత కూడా సజ్జల తన పెత్తనం పార్టీ మీద చెలాయించారు. కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చిపోండంటూ రెచ్చగొట్టారు. అలా రెచ్చిపోలేని వారు అసలు కౌంటింగ్ కేంద్రాలకే రానవసరం లేదని కూడా చెప్పేశారు. కట్ చేస్తే కౌంటింగ్ పూర్తై ఫలితాలు వచ్చేశాయి. వైసీపీ చరిత్ర ఇంత వరకూ ఎరుగని ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సరే ప్రజలు మోసం చేశారు. తాను పందేరం చేసిన సొమ్ములు తీసుకుని ఓట్లేయలేదు అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అది వేరే సంగతి.

ఇప్పుడు గెలిచిన, ఓడిన వైసీపీ నాయకులంతా  సజ్జననే నిందిస్తున్నారు. వాస్తవాలు అధినేతకు నివేదించుకోవడానికి వీల్లేకుండా సైంధవుడిగా అడ్డుపడ్డారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అంతే కాకుండా జగన్ ఓటమి తరువాత పార్టీ నేతలతో జరిపిన సమావేశంలో ఈ విషయాలన్నీ ఆయనకు ఏకరవు పెట్టారని సమాచారం దీంతో సజ్జలను పిలిపిద్దామని ప్రయత్నిస్తే ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ ఉంది. దీంతో అప్రమత్తమైన వైసీపీ అగ్రనాయకత్వం పార్టీ సోషల్ మీడియా విభాగం చీఫ్ సజ్జల భార్గవ్ ను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే ఆయన ఫోనూ స్విచ్చాఫ్ వచ్చిందట. దీంతో ఇప్పుడు వైసీపీ హైకమాండ్ వారి గురించి ఆరా తీస్తోందట. పిల్ల సజ్జల అదే సజ్జల భార్గవ్ రెడ్డి నిర్వాకం వల్ల పార్టీ సోషల్ మీడియాలో చెల్లించాల్సిన బిల్లులు కోట్ల రూపాయలలో ఉన్నాయనీ, అలాగే పార్టీకి సంబంధించిన ఆర్థిక పరమైన విషయాలెన్నో సజ్జల రామకృష్ణారెడ్డితో ముడిపడి ఉండటంతో ఇప్పుడు వైసీపీ  హైకమాండ్ వారిని వెతికే పనిలో నిమగ్నమై ఉందని పార్టీ వర్గాల సమాచారం.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu