ఇంకేముంది..అంతా అయిపోయింది...హరీశ్ రావు ఫోటోకు మంత్రి క్యాప్షన్
posted on Aug 19, 2025 4:00PM

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్లో సమాచార ప్రసారాల శాఖ ఏర్పాటు చేసిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గోన్నారు. అక్కడ ప్రదర్మించిన ఫోటోలను పరిశీలించిన పొంగులేటి తనదైన శైలిలో స్పందించారు. ఓ ఫోటో మాజీ మంత్రి హారీశ్‌రావు హావభావాలు ఇంకేముంది. అంతా అయిపోయింది. అన్నట్లుగా ఉన్నాయని సైటైర్ వేశారు. ఈ ఫోటో తీసిన కెమెరామెన్‌కు ప్రత్యేక కన్సోలేషన్ అవార్డు లభించింది. ఒక ఫోటో వేల పదాలకు సమాధానం...కొన్ని శతాబ్ధాల పాటు మిగిలిపోయే జ్ణాపకాలను అందిస్తుంది.
ఒక్కో ఫోటో ఒక్కో భావాన్ని, ఆలోచనను వ్యక్తపరుస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తీసిన ఆ ఫోటోలు ఎన్నో అర్ధాలను, ఎన్నో భావోద్వేగాలను కలిగిస్తాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను మంత్రి తిలకించాను. చాలా ఫోటోలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అందులో ఫోటోలు తీసిన విధానం, ఫోటోగ్రాఫర్లు పడిన కష్టం ఫోటోలలో స్పష్టంగా కనిపించిందని తెలిపారు. అద్భుతంగా తీసిన ఫోటోలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని పొంగులేటి వెల్లడించారు. మధుర జ్ణాపకాలను నెమరేసుకోవడంలోనే కాదు క్లిష్టమైన సమస్యల పరిష్కారంలో కూడా ఫోటోలు ఎంతో ఉపయోగపడిన సందర్భాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దేశ మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసు దర్యాప్తులో ఒకే ఒక్క ఫోటో కీలక ఆధారంగా మారి నిందితులకు శిక్ష పడేలా చేసింది. అదీ ఫోటో కున్న విలువ ఆయన తెలిపారు.
సమాచార పౌర సంబంధాల శాఖ నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, రాజీ యువ వికాసం, జనరల్ విభాగాల్లో గెలుపొందిన ఉత్తమ ఫోటోగ్రాఫర్లను సన్మానించి అవార్డులను మంత్రి అందజేశారు. ఫోటో గ్రాఫర్లను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం భవిష్యత్ లో కూడా కొనసాగిస్తుందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఒక ఫోటో వేల పదాలకు సమాధానం...కొన్ని శతాబ్ధాల పాటు మిగిలిపోయే జ్ణాపకాలను అందిస్తుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఐ అండ్ పీఆర్ కమిషనర్ ప్రియాంక , ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి, సీఎం సీపిఆర్వో మన్సూర్ పాల్గొన్నారు