ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అండ్ కోకి.. రప్పా రప్పా మొదలైనట్టేనా?
posted on Jun 22, 2025 11:06AM
.webp)
ట్యాపింగ్ వ్యవహారం కేసీఆర్ అండ్ కోని మరింతగా వెంటాడేలా తెలుస్తోంది. రీసెంట్ గా ప్రణీత్ రావును విచారించింది సిట్. ఆరు వందల మంది ప్రొఫైల్స్ ఎలా తయారు చేశారు. వారి ఫోన్లు విని ఏం చేశారు? ఆ సమాచారం ఎక్కడికి చేరవేసేవారు?లాంటి ప్రశ్నలతో పలు వివరాలను సేకరించారు. అయితే వీటితో సోమవారం ప్రభాకర్ రావును మరింతగా విచారించనున్నారు. ప్రభాకర్ రావు నుంచి ఎలాంటి ప్రశ్నలకు సమాధానం రాబట్టాల్సి ఉందో వాటికి అవసరమైన ప్రశ్నలు వేసి ప్రణీత్ నుంచి సమాధానాలు రాబట్టారు అధికారులు. మావోయిస్టులతో సంబంధం లేక పోయిన వారిని కూడా ఈ కోవలోకి ఎలా తెచ్చారు? అందుకు మీరు పాటించిన ప్రమాణికాలేంటని కూడా ప్రశ్నించారు. మొత్తానికి ఐదవ సారి సిట్ అధికారుల ముందు హాజరైన ప్రణీత్ రావును ఐదు గంటల మేర ప్రశ్నించారు.
ప్రణీత్ ఇచ్చిన సమాధానాలను అనుసరించి ప్రభాకర్ రావును సోమవంరం ప్రశ్నించనున్నారు. రివ్యూ కమిటీ ఆమోదం, తనపై ఉన్న ఇతర ఉన్నతాధికారుల సూచనల మేరకే తాను పని చేశానని అన్నారు ప్రభాకరరావు, దీంతో నాటి రివ్యూ కమిటీ అధికారుల వివరాలు కూడా బయటకు లాగి తద్వారా వారిని కూడా విచారించనుంది సిట్. ఇప్పటికే 15 మంది బాధితులను విచారించిన సిట్.. ఆపై వారి నుంచి తీసుకున్న వివరాలతోనూ ప్రభాకర్ రావును విచారించనుంది. గత పాలకుల ఆదేశాల మేరకే ప్రభాకర్ రావు ఇదంతా చేసినట్టు చెబుతున్నా.. కేసీఆర్ కి ఇంకా నోటీసులు ఎందుకివ్వలేదో చెప్పాలని అడిగారు కేంద్ర మంత్రి బండి సంజయ్, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యిందని ఇక్కడే మీకు అర్ధం కావడం లేదా? అని ప్రశ్నించారాయన. మొదట ప్రభాకర్ రావుకు ఇచ్చే ఆ రాచమర్యాదలను తగ్గించాలని కూడా డిమాండ్ చేశారాయన.