మరోసారి పేలిన పెట్రో బాంబ్
posted on Aug 31, 2013 8:32PM

కేంద్ర మరోసారి సామాన్యుడికి వాత పెట్టింది. ఇప్పటికే నిత్యవసర వస్తువులతో పాటు అన్నింటి రేట్లు చుక్కలు తాకుతున్న తరుణంలో ఇప్పుడు మరో బాంబ్ పేల్చింది. కేంద్ర ప్రభుత్వం శనివారం మరోమారు పెట్రోల్ రేటు పెంచింది. లీటర్ పెట్రోల్ ధర రూ. 2.35 పైసలతో పాటు, లీటరు డీజిల్ ధర 50 పైసలు పెంచారు. ఈ ధరలు శనివారం అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి. దీంతో వాహదారులపై పెనుభారం పడనుంది.
పెట్రోల్ ధర పెంచేందుకు ఆయిల్ కంపెనీలకు అనుమతినిచ్చిన దగ్గర నుంచి పెట్రోలియం సంస్థలు విచ్చలవిడిగా రేట్లు పెంచేస్తున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధన పెరగటంతో పాటు, రూపాయి విలువ భారీగా పతనం అవుతుండటంతో పెట్రోల్ రేటు పెంచక తప్పడం లేదంటున్నాయి కంపెనీలు.