జగన్ విధ్వంసాన్ని హిరోషిమాపై అణుబాంబు దాడితో పోల్చిన పయ్యావుల
posted on Feb 28, 2025 9:19AM

ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. ఆయన తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతుకు ముందు ఏపీ కేబినెట్ భేటీ బడ్జెట్ కు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
అప్పలు చేయడం తప్ప, అప్పులు తీర్చడం అన్నదే తెలియని జగన్ ప్రభుత్వం తీరు కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా తయారైందన్న పయ్యావుల కేశవ్.. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోందన్నారు. ఒక వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూనే, మరో పక్క రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం నిరాటంకంగా కొనసాగేలా అన్ని చర్యలూ తీసుకుందని పయ్యావుల చెప్పారు.
గత వైసీపీ ప్రభుత్వం ఏపీ అభివృద్ధికి అడ్డుకట్ట వేసిందన్న పయ్యావుల, వైసీపీ ప్రభుత్వ అరాచకం హిరోషిమాపై అణుదాడి కన్నా దారుణంగా అభివర్ణించారు. జగన్ అరాచక, విధ్వంస పాలనను వ్యతిరేకించిన ప్రజలు గత ఎన్నికలలో రాష్ట్ర భవిష్యత్, తమ పిల్లల భవిష్యత్ బాగుండాలంటే చంద్రబాబు నాయకత్వమే శరణ్యమని భావించి 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమికి అద్భుత విజయాన్ని కట్టబెట్టారని పయ్యావుల అన్నారు.