మోడీ పై ఉన్న శ్రద్ధ ఆంధ్రులపై లేదా.. పవన్ కళ్యాణ్

 

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ట్విట్టర్ ద్వారా ట్వీట్స్ పోస్ట్ చేశారు. మొన్నటి వరకూ ఏపీ ఎంపీలు ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా గురించి ఏం మాట్లాడటం లేదని.. ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు అదే ప్రత్యేక హోదా గురించి కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి గాలికొదిలేసిందని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కల్పిస్తానని హామి చేసిందని ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. కాగా ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ విషయంలో బీజేపీ పార్టీపై కాంగ్రెస్ పార్టీ బాగానే పోరాడింది.. కానీ ఏపీకీ ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా గురించి ఎందుకు పోరాడంలేదని ఎద్దేవ చేశారు. లలిత్ మోడీ పైన ఉన్న శ్రద్ధ ఐదు కోట్ల ఆంధ్రుల పైన లేదా అని ఆయన నిలదీశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu