అధికారంలోకి వస్తే ఆ పని చేస్తాం..


2019 ఎన్నికలే లక్ష్యంగా తాము పనిచేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. విశాఖపట్నంలోని అంబేద్కర్‌ భవన్‌లోనే బస చేసిన ఆయన ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 20 నుంచి జనసేన పోరాట యాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఉద్యమాల పుట్టినిల్లయిన శ్రీకాకుళం నుంచే తమ యాత్ర ప్రారంభమవుతుందని, 45 రోజుల పాటు కొనసాగుతుందని అన్నారు. అలాగే సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాల తీరుకు నిరసనగా అన్ని నియోజక వర్గాల్లో నిరసన కవాతు నిర్వహిస్తామని..మనకు రాజకీయ జవాబుదారీతనం ఉండే ప్రభుత్వాలు రావాలని, బీజేపీ పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్నారు. జనసేన ప్రభుత్వం వస్తే అన్ని జిల్లాల్లో అమరుల స్మారక చిహ్నాలు పెడతామని, 2019 ఎన్నికలే లక్ష్యంగా తాము పనిచేస్తామని పవన్ కల్యాణ్‌ తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu