పవన్ కళ్యాణ్ ను అతని అభిమానులు ఎంతలా ఆదరిస్తారో మాటల్లో చెప్పడం కొంచెం కష్టమైన పనే. అతనంటే అభిమానుల్లో ఎంత క్రేజో అందరికి తెలిసిందే. ఎందుకంటే అభిమానులు అతనంటే ఎంత ఇష్టపడతారో పవన్ కూడా వారిపట్ల అంతే ప్రేమతో ఉంటారు కాబట్టి. అభిమానులంటే తనకి ఎంత ఆదరాభిమానాలో మరోసారి రుజువు చేశారు పవన్. సెప్టెంబర్ 2 తన పుట్టిన రోజు సందర్భంగా భీమవరంలో అభిమానులు పవన్ కు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫ్లేక్సీలను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నాశనం చేసిన నేపథ్యంలో అక్కడ రెండు మూడు రోజుల పాటు పెద్ద గొడవలే జరిగాయి. అటుపోయి ఇటు పోయి ఆఖరికి ఆ గొడవ కాస్త కుల వివాదాల వరకూ వెళ్లింది. అయితే ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను ఎటువంటి గొడవలు చేయోద్దని.. భౌతిక దాడులు తనకు నచ్చవని సూచించారు. దీంతో గొడవ కాస్త సద్దుమణిగింది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చేసిన గొడవలకి అక్కడ ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులకు కొంచెం నష్టం కలిగింది. దీంతో తన అభిమానులు చేసిన నష్టానికి పరిహారాన్ని తనే చెల్లిస్తానని ముందుకు రావడం జరిగింది. దీనిలో భాగంగానే ముందుగా ఓ మూడు లక్షల రూపాయలని భీమవరం ఎస్ఐకి పంపించారట. అభిమానులకు ఏదైనా నేనున్నా అంటూ ముందుంటారు కాబట్టే పవన్ అంటే వారికి అంత ప్రేమ.. ఓరకంగా చెప్పాలంటే పిచ్చి.