పర్వతం ఎవ్వడికి ఒంగి సలామ్ చెయ్యదు.. పవన్

 


జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వాతంత్యదినోత్సవం సందర్భంగా అందరికి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆయన చేసిన ట్వీట్ లు అందరిలో ఆసక్తి రేపుతున్నాయి. ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ట్వీట్ లు చేశారు.


"సముద్రం  ఒకడి  కాళ్ళ  దగ్గర  కూర్చుని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతంఎవ్వడికి  ఒంగి సలామ్ చెయ్యదు.. నేనింతా ఒక  పిడికెడు మట్టే కావచ్చు కాని కలమెత్తితే ఒక దేశపు జండా కున్నంత  పొగరుంది అంటూ ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ కావ్యాన్ని గుర్తుచేస్తూ ట్వీట్స్ పోస్టు చేశారు. కవి శేషేంద్ర శర్మ ఎలాగైతే చెప్పారో అలాంటి భావనే ప్రతిఒక్కరి మనసులో ఉండాలని అన్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu