అసెంబ్లీ, బడ్జెట్ అంటే ఎంటో తెలుసా? జగన్ కు పత్తిపాటి ప్రశ్న
posted on Sep 22, 2015 5:44PM

ఏపీ వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. విశాఖపట్నంలో జరిగిన యువభేరి కార్యక్రమంలో పాల్గొన్న జగన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక హోదా అంటే ఏంటో తెలియదు అని విమర్శించారు. ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలను పత్తిపాటి ఖండించారు. ప్రత్యేక హోదా గురించి సీఎం చంద్రబాబు, మంత్రులకు తెలియదని జగన్ అంటున్నారని, జగన్‌కు అసెంబ్లీ, బడ్జెట్ అంటే ఎంటో తెలుసా? అని ఆయన అన్నారు. ఎన్నికలప్పుడు జగన్ మాత్రం రైతు రుణమాఫీ సాధ్యం కాదని చెప్పారు.. కానీ రాష్ట్రం విడిపోయి ఆర్ధిక లోటు ఉన్నా గాని చంద్రబాబు రుణమాఫీలు చేశారు.. అలాంటిది జగన్ కు రైతు రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తన తండ్రి పదవిని అడ్డుపెట్టుకొని అనేక అవినీతి పనులు చేశారని అన్నారు. అంతేకాదు తెలుగుదేశం, బిజెపి విడిపోవాలని జగన్ కోరుకుంటున్నారని, దాంతో కేసుల నుంచి బయటపడాలని ఆయన ఆరాటపడుతున్నారని విమర్శించారు.