భగ్గుమన్న పాతబస్తీ

 Patha Basti Hyderabad, Bhagyalakshmi temple Hyderabad, Tension in Hyderabad Old City, Bhagyalakshmi Temple Issue

 

 

పాతబస్తీలో మరోసారి ఆందోళనకర వాతావరణం నెలకొంది. శుక్రవారం చార్మినార్ వద్ద ఉన్న మక్కా మసీదులో ప్రార్ధనలు పూర్తయిన అనంతరం కొందరు యువకులు పోలీసులపై రాళ్లు రువ్వడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు భాష్పవాయువు ప్రయోగించి పరిస్థతిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చార్మినార్ వద్ద ఆంక్షలు పెట్టడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితిని అదుపు చేయడానికి వీలుగా పోలీసులు 144 వ సెక్షన్‌ను విధించారు.


శుక్రవారం మక్కా మసీదులో ప్రార్థనలు జరుగనున్న సందర్భంగా పోలీసులు ముందు జాగ్రత్తగా చర్యగా చార్‌మినార్ పక్కన గల భాగ్యలక్ష్మి ఆలయాన్ని శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల వరకు మూసివేశారు. అయితే ప్రార్థనల అనంతరం ఒక వర్గానికి చెందిన యువకులు చార్‌మినార్ వైపు పరుగులు తీస్తూ రావడం మొదలుపెట్టగా వారిని అడ్డుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసులపై వారు రాళ్లు విసరడంతో పరిస్థితిని అదుపుచేయడానికి చర్యలు తీసుకున్నట్టు పోలీసు చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu