గీతారెడ్డిపై కామెంట్స్: కోదండ ఇంటివద్ద ఉద్రిక్తత
posted on Nov 16, 2012 2:18PM

తెలంగాణ జేఈసీ కోదండరాంపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ విద్యార్థి సమాఖ్యలు ధ్వజమెత్తాయి. గీతారెడ్డిపై ఇటీవల కోదండరాం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన నేపథ్యంలో ఈ రెండు సంఘాల ప్రతినిధులు తార్నాకలోని కోదండరాం ఇంటిముందు ఆందోళనకు దిగాయి. గీతారెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలని.. అది కూడా స్వయంగా ఆమెను కలిసి చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
ఆందోళనకారులు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కొందరు నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు.
గీతారెడ్డిపై కోదండరాం చేసిన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. లేదంటే ఆయనను తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు.