ఆరునూరైనా 'టి' బిల్లుపై చర్చ

 

 

 

లోక్ సభలో తెలంగాణా బిల్లుపై మంగళవారం చర్చ జరుగుతుందని పార్లమెంటరీ శాఖ మంత్రి కమల్‌నాథ్ వెల్లడించారు. లోక్ సభలో చిదంబరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో సీమాంధ్ర మంత్రులు సమైక్య నినాదాలతో సభలో గందరగోళం సృష్టించారు. ఈ సమయంలో సభలో అటూ ఇటూ తిరుగుతూ హడావుడి చేస్తున్న కమలనాథ్, సీమాంద్ర మంత్రుల వద్దకు వెళ్లి మీరు ఏమైనా చేసుకోండీ..రేపు తెలంగాణా బిల్లుపై చర్చ జరిగితీరుతుంది అని చెప్పారు.


సీమాంధ్ర సభ్యులు సభలో నినాదాలు చేస్తున్నప్పుడు.. చిదంబరానికి తమిళనాడుకు చెందిన ఎంపీలు ఆ పక్కనే రక్షణగా నిలబడ్డారు. మధ్యలో సమాజ్‌వాది సభ్యులు సీమాంధ్ర మంత్రులకు మద్దతుగా ముందుకువచ్చినప్పుడు కమల్‌నాథ్ వెంటనే ములాయంవద్దకు వెళ్లి మీ వాళ్లను గొడవ చేయవద్దని వెనక్కి పిలిపించండీ అని బ్రతిమలాడారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu