బిల్ పాస్ కానివ్వను... రాహుల్ గాంధీ

 

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ఓ సవాల్ విసిరారు. మంగళవారం లోక్ సభలో భూసేకరణ చట్టం బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ తమను కాదని బిల్లును ఎలా పాస్ చేస్తారో చూస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లు పాస్ కానివ్వనని సవాల్ చేశారు. బిల్లుపై ఏకాభిప్రాయానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నించడం లేదని అన్నారు. రైతుల భూములను కాజేయటానికే ఎన్డీఏ ప్రభుత్వం చూస్తుందని ఆరునూరైనా బిల్లు ఆమోదింపజేయనీయమని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu