అమాయకులను చంపడానికే వచ్చా.. టెర్రరిస్ట్ షాకింగ్ విషయాలు


కాశ్మీర్లోని కుప్వారా జిల్లా నౌగామ్ వద్ద జరిగిన ఎన్ కౌంటర్లో భద్రతా బలగాలకు బహదూర్ ఆలీ అలియాస్ సైఫుల్లా అనే ఓ ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అతనిని విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థకు.. బహదూర్ అలీ చెప్పే విషయాలను వింటుంటే దిమ్మతిరిగిపోతుంది. ‘నేను కశ్మీర్‌కు సాధారణ, అమాయక జ‌నాల‌ని హ‌త‌మార్చేందుకు వ‌చ్చా.. గెరిల్లా వార్ ఫేర్ లోని లష్కరే తోయిబాలో శిక్షణ తీసుకొన్నా’ అని అలీ తెలిపాడు. ‘ఆ త‌రువాత జమాత్ ఉద్ దవా (జుద్) ఛీఫ్ హఫీజ్ సయీద్ ను రెండు సార్లు క‌లిశా, పాకిస్థాన్‌లోని కంట్రోల్ రూమ్ తో నేను నిత్యం ట‌చ్‌లోనే ఉంటా’ అని అన్నాడు.

 

కాగా గత వారం ఎన్ కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమవ్వగా.. బహదూర్ ఆలీ ప్రాణాలతో చిక్కాడు. అతని దగ్గర నుండి మూడు ఏకే-47 రైఫిల్స్, రెండు తుపాకులు, 23 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu