పాకిస్థాన్.. రెండు వికెట్లు

 

ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో భాగంగా శుక్రవారం అడిలైడ్‌లో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ దేశాలు తలపడుతున్నాయి. పాకిస్తాన్ టాస్ గెలుచుకొని బ్యాటింగ్ ఎంచుకొంది. అయితే పాకిస్థాన్ బ్యాటింగ్ ప్రారంభించిన వెంటనే రెండు వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. 22 పరుగుల స్కోరు దగ్గరకు వచ్చేసరికే రెండు వికెట్లను కోల్పోయింది. అహ్మద్ హెహజాద్ (5), షర్ఫాజ్ అహ్మద్ (10) పరుగులు చేసి ఔటయ్యారు. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు ఓడిపోయినా జట్టు ప్రపంచ కప్ పోటీల నుండి తప్పుకోవలసి ఉంటుంది కనుక రెండు టీమ్ లకు ఇది చాలా కీలకమయిన మ్యాచ్. భారత్ టీమ్ ఈ రోజు మ్యాచ్‌లో విజయం సాధించిన టీమ్‌తో సెమీ ఫైనల్స్ మ్యాచ్ ఆడుతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu