పంజాగుట్టలో యువతి సజీవ దహనం

 

హైదరాబాద్‌లోని పంజాగుట్టలో దారుణం జరిగింది. ఒక యువతి సజీవ దహనమైంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కి సమీపంలోనే ఈ దారుణ ఘటన జరిగింది. శ్రీనగర్ కాలనీ సిగ్నల్స్ దగ్గరలోని అగర్వాల్ ఐ ఆస్పత్రి వెనుక ఉన్న ఐఏఎస్ క్వార్టర్స్‌ ఖాళీ స్థలంలో 25 ఏళ్ల యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని దుండగులు ఆ యువతి మృతదేహాన్ని పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన యువతి ఎవరై వుంటుందన్న ప్రాథమిక అంచనా కూడా వేయలేని విధంగా అక్కడి పరిస్థితి వుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu