ఉగ్రవాదం అంతం చేయకుంటే పాకిస్ధాన్‌‌ను అంతం చేస్తాం..ప్రధాని మోదీ హెచ్చరిక

 

 

భారత దళాల దాడితో పాకిస్ధాన్‌కు మూడు రోజుల్లోనే ముచ్చెమటలు పట్టాయని ప్రధాని మోదీ అన్నారు. పాక్ భయాందోళనకు గురై మన డీజీఎంఓతో కాళ్ల బేరానికి వచ్చిందని ప్రధాని తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌తో 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతం చేశామని ప్రధాని పేర్కొన్నారు. ఉగ్రవాదులు మా చెల్లెళ్ళ సిందూరాన్ని తుడిచారు.. అందుకే ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేశామని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదులను ఒక్క దెబ్బతో ఖతం చేశామని వెల్లడించారు"ప్రజలు, రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల వారు ఒక్కతాటిపైకి వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. భారతీయ మహిళల నుదుటిపై సిందూరం తుడిచివేసిన వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో... అదే ఆపరేషన్ సిందూర్. గత నాలుగు రోజులుగా భారత సైన్యం పోరాట సామర్థ్యాన్ని చూస్తున్నాం. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత్ దెబ్బతీసింది. ఉగ్రవాద శిబిరాలపై భారత్ క్షిపణులు, డ్రోన్లతో కచ్చితత్వంతో దాడులు చేశాయి. 

బహావల్ పూర్, మురిడ్కే వంటి తీవ్రవాద స్థావరాలపై దాడి చేయడం ద్వారా భారత్ బీభత్సం సృష్టించింది. ఈ సందర్భంగా మనదేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించింది. మన నిఘా వర్గాల సామర్థ్యం, శాస్త్రసాంకేతిక సత్తా ఏంటనేది దేశం మొత్తానికి తెలిసింది. సైన్యం సాహసం, పరాక్రమాన్ని దేశం మొత్తం చూసింది. భారత రక్షణ దళాలు చూపిన ధైర్య సాహసాలు దేశానికి తలమానికంగా నిలుస్తాయి" అని కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ కేవలం పేరు మాత్రమే కాదు.. దేశ ప్రజల భావనల ప్రతిబింబం అని ప్రధాని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ న్యాయానికి ప్రతీక ఆయన అన్నారు. 

ప‌హ‌ల్గాంలో ఉగ్ర‌వాదులు మ‌తం పేరు అడిగి మ‌రీ కుటుంబ స‌భ్యుల ముందు కాల్చిచంపారు. ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడితో దేశ‌మంతా నివ్వెర‌పోయింది. ఉగ్ర‌వాద దాడుల‌పై ప్ర‌తి హృద‌యం జ్వ‌లించిపోయింది. పౌరులు, పార్టీలు అన్ని ఒక్క‌తాటిపైకి వ‌చ్చి ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా నిల‌బ‌డ్డాయి అని మోదీ తెలిపారు.సైన్యం, సాహ‌సం, ప‌రాక్ర‌మాన్ని దేశం చూసింది. భార‌తీయ మ‌హిళ‌ల నుదుటిపై సిందూరం తుడిచేసిన వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో అదే ఆప‌రేష‌న్ సిందూర్.. ఆప‌రేష‌న్ సిందూర్ ఒక పేరు కాదు.. ఒక ఆవేద‌న. ఆప‌రేష‌న్ సిందూర్ న్యాయం కోసం చేసిన ఓ ప్ర‌తిజ్ఞ‌. ఈ నెల ఏడో తేదీ తెల్ల‌వాజుమ‌న ఈ ప్ర‌తిజ్ఞ నెర‌వేర‌డం ప్ర‌పంచ‌మంతా చూసింది అని మోదీ పేర్కొన్నారు.పాకిస్ధాన్ తెగబడినా భారత్‌ దళాలు చావు దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయిని ప్రధాని మోదీ హెచ్చరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu