భారత్-పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపాను..ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

 

భారత్-పాక్ మధ్య అణుయుద్దాన్ని ఆపాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యూక్లియర్ యుద్దం జరిగి ఉంటే లక్షలాది ప్రజలు ప్రాణాలు పోయేవని తెలిపారు. కాల్పుల విరమణ కోసం రెండు దేశాలపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ ఘర్షణలు ఆపకపోతే రెండు దేశాలతో మేము వ్యాపారం చేయము అని చెప్పామని.. వారు గొడవలు ఆపేశారని  ట్రంప్ పేర్కొన్నారు. తన మాట విని భారత్, పాక్ సీజ్‌ఫైర్ అమలు చేశాయని పేర్కొన్నారు. ఇకపై ఆ దేశలతో వాణిజ్యాన్ని పెంచుతానన్నారు. నా పరిపాలన హయాంలో, అణ్వాయుధాలు కలిగిన రెండు దేశాలైన భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంలో కీలక పాత్ర పోషించాం అని ఆయన తెలిపారు. 

ఆ సమయంలో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉందని, ఇరు దేశాలు భీకరంగా పోరాడుకునే స్థితిలో ఉన్నాయని ట్రంప్ వివరించారు.ఈ సంక్షోభ సమయంలో ఇరు దేశాల నాయకత్వాల గురించి ప్రస్తావిస్తూ, "భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాల నాయకత్వాలు శక్తిమంతమైనవి, దృఢంగా నిలబడ్డాయి" అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని చల్లార్చడానికి వాణిజ్యాన్ని ఒక దౌత్య వ్యూహంగా ఉపయోగించినట్లు ఆయన తెలిపారు. ఈ జోక్యం ద్వారా లక్షలాది మంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్న అణు సంఘర్షణను తాము ఆపగలిగామని ట్రంప్ ముగించారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu