ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్!

పాక్ ఉగ్రవాదులను ఏరిపారేసిన ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ కు నాంది పలుకుదామని తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపు నిచ్చారు. మహానాడు ముగింపు సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన టెర్రరిస్టులు దేశానికి ఎంత ప్రమాదమో....రాజకీయ ముసుగులో ఉన్న ఆర్ధిక ఉగ్రవాదులు అంత కంటే ప్రమాదమన్నారు. వారిని రాష్ట్రం నుంచి తరిమికొడదామన్నారు.

అందుకే  ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ తో వారిని రాజకీయాల్లో లేకుండా చేద్దామన్నారు.  రాజకీయాలు అడ్డం జగన్ హయంలో ల్యాండ్, సాండ్, వైన్, మైన్ కుంభకోణాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్న చంద్రబాబు.. ఒక్క చాన్స్ అంటే నమ్మి నాడు ఓటేసి గెలిపిస్తే..   జగన్ హయాంలో జె బ్రాండ్స్‌తో, గంజాయి, డ్రగ్స్‌తో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేశారనీ,  అడవులను ఆక్రమించి ఎస్టేట్ లు నిర్మించుకున్నారని... కొండలు, చెరువులు కూడా మింగేశారని,     ప్యాలెస్‌ల నుంచి ఎస్టేట్‌ల వరకు అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని విమర్శించారు.

అదికార అహంతో విర్రవీగిన వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్న చంద్రబాబు  పార్టీ ఎలా ఉండాలో, పాలన ఎలా ఉండాలో చెప్పడంలో టీడీపీ ప్రస్థానం ఒక ఒక కేస్ స్టడీ అయితే.. పాలకులు ఎలా ఉండకూడదో, పార్టీ ఎలా నడపకూడదో చెప్పడానికి వైసీపీ ఒక కేస్ స్టడీ అన్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu