ప్రపంచాన్ని చుట్టేస్తున్న ఒమిక్రాన్‌.. వచ్చిందంటే ఆగదు..

వచ్చేసింది. కరోనా మహమ్మరి మరో రూపం ఒమిక్రాన్‌ వచ్చేసింది. మన దేశంలోకి మాత్రమే కాదు ప్రపంచం మొత్తన్ని చుట్టేస్తోంది. ఇప్పటికే  30కి పైగా దేశాల్లో 370కి పైగా ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్‌’ పుట్టిల్లు దక్షిణాఫ్రికాలో కీలకమైన సార్స్‌కోవ్‌-2 ఆర్‌నాట్‌ విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో వ్యాప్తిని అడ్డుకోవడం మరింత కష్టం కానుంది. భారత్‌లో కూడా ఇద్దరిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించారు. వీరిలో ఒకరు డాక్టర్‌ కాగా.. ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఐదురుగు కూడా తాజాగా కొవిడ్‌ పాజిటివ్‌గా తేలారు. వీరికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిందో లేదో మాత్రం తేలలేదు.కాగా, దక్షిణాఫ్రికాలో  ఒమిక్రాన్‌ వేరియంట్‌ను  విస్తరణ వేగాన్ని గమనిస్తే, ఒకసారి సారి దేశంలో ప్రవేశిస్తే ఇక కట్టడి చేయడం అయ్యేపని కాదని, అంటున్నారు. దక్షిణాఫ్రికా విషయాన్నే తీసుకుంటే,   నవంబర్‌ 16న ఆ దేశంలో  మాత్రమే   కేవలం 136 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే, నవంబర్‌ 24న ఒమిక్రాన్‌ వేరియంట్‌తోలి కేసు నమోదు అయితే, రెండే రెండు రోజుల్లో నవంబర్‌ 26 నాటికి అక్కడ రోజువారీ కేసుల సంఖ్య 3,402కు పెరిగింది. అదే డిసెంబర్‌ 1 నాటికి 8,561కి చేరినట్లు లెక్కలు చెబుతున్నాయి. 

కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్న గౌటెంగ్‌ ప్రావిన్స్‌లో ఆర్‌నాట్‌ విలువ 2గా ఉందని  నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌ఐసీడీ) వెల్లడించినట్లు నేచర్‌ పత్రిక కథనం పేర్కొంది. వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని ఆర్‌నాట్‌గా పేర్కొంటారు.ఆర్‌నాట్‌ విలువలో ఈ స్థాయి పెరుగుదలను కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో చూసినట్లు నిపుణులు చెపుతున్నారు. 

కాగా, మన దేశంలో పరిస్థితిపై ఇంకా పూర్తి స్పష్టత రక పోయినా, ఇప్పటికే బెంగుళూరులో రెండు కేసులు నమోదిన నేపద్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పార్లమెంట్’లోనూ చర్చ జరిగింది.  రెండో విడత ఉద్ధృతిమిగిల్చిన చేదు అనుభవాల నేపధ్యంలో, ఒమిక్రాన్‌ను సకాలంలో కట్టడి చేసేందుకు కదలాలని విపక్షాలు ప్రభుత్వానికి సూచించాయి. టీకా బూస్టర్‌ డోస్‌పై స్పష్టతనివ్వాలని డిమాండ్‌ చేశారు. వృద్ధులు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్న వారికి మూడో డోసు ఇవ్వడంపై ప్రభుత్వం విధాన నిర్ణయాన్ని ప్రకటించాలని కోరారు. కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య వ్యవధిని 86 రోజుల నుంచి తగ్గించాలని సూచించారు. ఒమిక్రాన్‌ రకం వైరస్‌ వ్యాపిస్తున్నందున దేశంలోకి వచ్చే అంతర్జాతీయ విమానాలను నిషేధించాలని కోరారు.అయితే, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తూనే ఆచి తూచి అడుగులు వేస్తోంది.