ఎన్టీఆర్, హరీష్ శంకర్ మూవీ అప్ డేట్స్
posted on Apr 16, 2013 3:41PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బాద్ షా' సూపర్ హిట్ అవడంతో ఫుల్ జోష్ లో వున్న ఎన్టీఆర్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో చేస్తున్న సినిమాలో బిజీ గా ఉన్నాడు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ లాంకో హిల్స్ సమీపంలో చిత్రీకరణ జరుగుతుంది. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నారు. బృందావనం తరువాత ఎన్టీఆర్, సమంత చేస్తున్న సెకండ్ ఫిల్మ్ ఇది. ఈ సినిమాలో ఎన్టీఆర్, సమంత కెమిస్ట్రీ బాగా పండిందని డైరెక్టర్ ట్విట్ కూడా చేశారు. వీరిద్దరి మద్య వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ బాగా ఆకట్టుకుంటాయని హరీష్ ధీమా వ్యక్తం చేశాడు. థమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని ఈ సంవత్సరం సెకండాఫ్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.