మోహన్ బాబు ఫ్యామిలీ మల్టీస్టారర్

 mohan babu, manoj vishnu, mohan babu new movie, manoj new movie

 

 

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ మధ్య కాలంలో సినిమాల్లో తన దూకుడును పెంచినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే పలు చిత్రాల్లో నటిస్తున్న ఈయన తాజాగా తన కుమారులు నిర్మించే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మంచు విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్ లు కూడా నటించబోతున్నారు. మోహన్ బాబు సరసన అలనాటి అందాల తార రవీనా టాండన్ నటిస్తుంది. కథానాయికలుగా ప్రణీత, హన్సిక నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘లక్ష్యం ’ ఫేం దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ రచయితలు అయిన గోపీ మోహన్, కోనవెంకట్, బీవీఎస్ రవి లు పనిచేస్తున్నారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నలుగురు సంగీత దర్శకులు స్వరాలు సమకూర్చ బోతున్నారు. ఈ చిత్ర షూటింగు ఈ నెల 21 ప్రారంభం కాబోతుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu