దిగొచ్చిన ఉత్తర అమెరికా... చర్చలకు సిద్ధమే..

 

ఉత్తరకొరియాకు అమెరికాకు మధ్య గత కొద్దికాలంగా జరుగుతున్న కోల్డ్ వార్ గురించి తెలిసిందే. రెండు దేశాల మధ్య పెద్ద యుద్దమే జరుగుతుందేమే అనుకున్నారు అంతా. అయితే అదేమి జరగలేదు కానీ..ఉత్తరకొరియాపై తీరుపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆదేశంపై ఆంక్షలు విధించారు. ఇక ట్రంప్ ఆంక్షలపై స్పందించిన ఉత్తరకొరియా... అమెరికా ఆంక్షలు విధిస్తే దానిని తాము యుద్ధంగా పరిగణిస్తామని ప్రకటించింది. అయితే ప్రకటించిన కొద్దిసేపటికే.. మనసు మార్చుకున్నట్టు ఉంది. అందుకే.. ప్రకటించిన కాసేపటికే.. ఆ దేశంతో చర్చలకు సిద్ధమని తెలిపింది. దక్షిణ కొరియాలో నిర్వహించిన వింటర్‌ ఒలింపిక్స్‌ క్రీడల ముగింపు ఉత్సవానికి వచ్చిన ఉత్తరకొరియా ప్రత్యేక బృందం... అమెరికాతో సంబంధాలపై స్పందిస్తూ, శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు.. ఉత్తరకొరియా ప్రత్యేక బృందం దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ తో సమావేశమవ్వగా... అమెరికాతో కయ్యానికి కాలుదువ్వకుండా సామరస్యంగా ముందుకెళ్లాలని ఆయన వారికి సూచించినట్టు తెలుస్తోంది.