శ్రీదేవి కోసం ముందుకొచ్చిన ముఖేష్ అంబానీ..

 

అందాల తార శ్రీదేవి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే కదా. తమ బంధువుల పెళ్లికి దుబాయ్ భర్త బోనికపూర్, చిన్న కూతురితో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి అక్కడే తీవ్ర గుండెపోటుకు గురయ్యి మృతి చెందారు. దీంతో దేశం ఒక్కసారిగా షాక్ గురైంది. సినీ పరిశ్రమలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే అక్కడి నుండి ఆమె భౌతిక కాయం మాత్రం ఇంతవరకూ భారత్ చేరుకోలేదు. అక్కడి నుండి ఇక్కడికి మృతదేహాన్ని తీసుకురావడంలో కొన్ని సమస్యలు తలెత్తడంతో.. రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీ ముందుకు వచ్చారు. అక్కడి నుంచి ఆమె భౌతిక కాయాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు.. రిలయన్స్ సంస్థకు చెందిన 13 సీట్ల ప్రైవేటు జెట్‌ విమానాన్ని దుబాయ్‌ కి పంపించారు. నిన్న మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ విమానం దుబాయ్‌ కు వెళ్లింది. అయితే అక్కడ పోస్ట్ మార్టం జరగడంలో కాస్త ఆలస్యం అవ్వడంతో .. శ్రీదేవి మృతదేహం ఇంకా స్వదేశం చేరలేదు. శ్రీదేవి భౌతిక కాయంతో పాటు కుటుంబ సభ్యులు, సమీప బంధువులు ఈ విమానంలో ముంబై చేరనున్నారు.