క్రీడాకారుల కోసం జాతీయ సంక్షేమ నిధి ప్రతిపాదనలు పంపని జగన్ సర్కార్!

కేశినేని చిన్న ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం

గత అయిదేళ్లలో  క్రీడాకారుల కోసం జాతీయ సంక్షేమ నిధి అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రతిపాదన సమర్పించిందా? ఎపిలోని  క్రీడాకారుల కోసం జాతీయ సంక్షేమ నిధి నుండి కేటాయించిన  మొత్తం నిధులు ఎంత? ఆ నిధుల వినియోగం, ల‌బ్ధి పొందిన క్రీడాకారుల వివ‌రాల పై సోమ‌వారం పార్ల‌మెంట్ లో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్  కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల శాఖ‌ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మండవియా ను ప్ర‌శ్నించారు.  కేంద్ర‌మంత్రి డాక్టర్ మన్సుఖ్ మండవియా లిఖిత‌పూర్వ‌కంగా ఎంపి కేశినేని శివనాథ్ కి  స‌మాధానం చెప్పారు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంతో పాటు దేశ‌వ్యాప్తంగా క్రీడాకారుల కోసం పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ క్రీడాకారుల జాతీయ సంక్షేమ పథకం అమ‌లు అవుతున్నద‌ని,  గ‌త ఐదేళ్ల‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి  క్రీడాకారుల కోసం జాతీయ సంక్షేమ నిధి అమలు చేయడానికి ఎలాంటి ప్రతిపాదన అందలేదని కేంద్ర‌మంత్రి డాక్టర్ మన్సుఖ్ మండవియా  ఇచ్చిన లిఖిత పూర్వక స‌మాధానంలో తెలియ‌ప‌ర్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu