కొత్త జిల్లాలా.. అలాంటిదేమీ లేదు... కేసీఆర్

 

ఈమధ్య కాలంలో తెలంగాణలోని 10 జిల్లాలను విభజించబోతున్నారని, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. 10 జిల్లాలను 24 జిల్లాలుగా విభజించనున్నారని కొన్ని పత్రికలలో, కాదు కాదు... ప్రస్తుతానికి ఏడు జిల్లాలను మాత్రమే పెంచుతున్నారని మరికొన్ని పత్రికలలో వచ్చాయి. ఈ జిల్లాలల పెంపు విషయంలో తెలంగాణ ప్రజల్లో కొంత అయోమయ పరిస్థితి ఏర్పడింది. దీ పరిస్థితికి తెలంగాణ సీఎం కేసీఆర్ తెర దించారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాతే కొత్త జిల్లాల ఏర్పాటు వుంటుందని కేసీఆర్ తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu