అభ్యర్థి దొరికినప్పుడే ఎన్నిక.. కేనడాలోని ఓ పట్టణంలో వింత పరిస్థితి
posted on Oct 25, 2024 2:31PM
.webp)
సాధారణంగా ఎన్నికలంటే పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీకి రెడీ అయిపోతారు. ప్రధాన రాజకీయ పార్టీల నుంచే కాకుండా స్వతంత్రులు కూడా పోటీకి రెడీ అయిపోతారు. జయాపజయాలు తరువాత సంగతి ముందు రంగంలోకి దిగి సత్తా చాటాలన్న ఆకాంక్షతో పలువురు పోటీకి సై అంటూ నామినేషన్లు దాఖలు చేస్తారు. అలాంటిది కెనడాలోని ఓ నగరంలో మేయర్ పదవికి ఎన్నిక జరుగుతుంటే పోటీ చేసేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కెనడాలోకి సస్కట్చేవాన్ అనే పట్టణం మేయర్ అభ్యర్థి పదవి కోసం పోటీకి ఎవరూ ముందుకు రాని వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ పట్టణంలో మేయర్ ఎన్నిక వచ్చే నెల 13న జరగాల్సి ఉంది. ప్రస్తుతం మేయర్ గా ఉన్న జార్జి విలియమ్స్ ఈ ఏడాది నవంబర్ లో రిటైర్ కానున్నారు. దీంతో మేయర్ ఎన్నిక అనివార్యమైంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 13న మేయర్ ఎన్నిక జరగాల్సి ఉంది. ఇప్పటికి రెండు దఫాలుగా దరఖాస్తులను ఆహ్వానించినా ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాని పరిస్థితి.
అయితే మేయర్ పదవికి ఎవరూ పోటీ చేయకపోయినా కొంపలు మునిగిపోయే పరిస్థితి ఏమీ లేదని చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి అండర్ డాష్నీ అంటున్నారు. అయితే ఎవరో ఒకరు ముందుకు రాకపోరన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూనే పోటీకి ఎవరూ ముందుకు రాకపోతే పట్టణ కౌన్సిల్ డిప్యూటీ మేయర్ ను ఎన్నుకుంటుందనీ, ఆయన అధ్యక్షతన సమావేశమైన కౌన్సిల్ మేయర్ ఎన్నిక కోసం మరో తేదీని నిర్ణయిస్తుందనీ చెప్పారు. అలా మేయర్ అభ్యర్థి జరిగే వరకూ ఈ తంతు కొనసాగుతుందన్నారు.